Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్......!! 22 d ago

8K News-13/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్.. ఇంట్రాడేలో ఆ లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు నష్టపోగా.. నిఫ్టీ సైతం 22,400 దిగువన వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిసింది. చివరికి 200.85 పాయింట్ల నష్టంతో 73,828.91 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 73.30 పాయింట్ల నష్టంతో 22,397.20 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ ఉదయం 74,392.54 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,401 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి.